Vishnupriya elimination: విష్ణుప్రియ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!
on Dec 7, 2024
14వ వారంతో చివరి నామినేషన్స్ ముగిశాయి. హౌస్‌లో మొత్తం ఏడుగురు ఉంటే.. వాళ్లలో అవినాష్ తప్ప మిగిలిన ఆరుగురు నేరుగా నామినేట్ అయ్యారు. అవినాష్ సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు దాంతో రోహిణి, విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఎవరు సేవ్ కావచ్చు.. ఎవరు ఎలిమినేట్ కావొచ్చు. అసలు ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.
గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ, రోహిణిలు నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే వీళ్లలో నిఖిల్, గౌతమ్‌లు టాప్ ఓటింగ్‌లో ఉండటంతో.. వీరు విన్నర్ రేస్‌లో పోటీపడబోతున్నారు. కాబట్టి.. ఈవారం ఎలిమినేషన్స్‌లో ఈ ఇద్దరూ లేనట్టే. ఇక ప్రేరణ, నబీల్‌లు కూడా తరువాతి స్థానాల్లో ఉండటంతో ఈ ఇద్దరూ డేంజర్ జోన్లో లేనట్టే. నిజానికి నబీల్ గత రెండు మూడు వారాలుగా ఆటలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నా కూడా.. అతనికి సొంత కమ్యునిటీ ఓట్లు, సోషల్ మీడియా క్రేజ్ పనిచేసి.. అతని ఈవారం డేంజర్ జోన్ నుంచి గట్టెక్కేసినట్టే. ఇక మిగిలింది రోహిణి, విష్ణు ప్రియ. ఈవారంలో ఎలిమినేట్ అయ్యేది ఈ ఇద్దరిలో ఒకరు. ఈ ఇద్దరిలో ఆట పరంగా చూస్తే రోహిణి ది బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విష్ణు ప్రియ.. పృథ్వీ మైకంలో పడి అసలు 14వ వారం వరకూ కూడా ఆటే ఆడలేదు. వీకెండ్ పెర్ఫామెన్స్ తప్పితే ఒక్కటంటే ఒక్క వారం కూడా విష్ణు బెస్ట్ అనిపించింది లేదు. ఎప్పుడు చూసినా.. ఆ పృథ్వీని రంజింపజేయడంతోనే సరిపోయింది ఈమెకి. కాస్త ఆటపై దృష్టిపెట్టమ్మా అని ఎవరైనా సలహా ఇస్తే.. నాకు పృథ్వీ తప్ప ఏమీ వద్దు.. నాకు ఎవరూ చెప్పొద్దు. ఇష్టం ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే మూసుకుని ఉండండి అన్నట్టుగానే చాలాసార్లు చెప్పుకొచ్చింది.
ఈవారం విష్ణుప్రియ కూడా లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్లోనే ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆట పరంగా చూస్తే విష్ణు కంటే రోహిణి వంద రెట్లు బెస్ట్. కానీ చివరి వారంలో ఎలిమినేషన్స్ అనేవి అల్లాటప్పాగా జరగవు. ఓటింగ్ లెక్కలే కాదు.. చాలా లెక్కలు ఉంటాయి. ఎవర్ని ఉంచాలి.. ఎవర్ని పంపాలి అనేది.. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టే కాకుండా బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే.. చివరి వారంలో ఎలిమినేషన్ ఫైట్ చాలా టఫ్‌గా ఉంటుంది. మన దత్తపుత్రిక విష్ణుప్రియకి బిగ్ బాస్ సపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే జరిగితే రియల్ గేమర్ అండ్ ఎంటర్టైనర్ రోహిణి ఎలిమినేషన్ అవ్వాల్సిందే. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ చేస్తే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేషన్ గ్యారెంటీ.
Also Read